2000

కలలై పోయెను

kalalai poyenu

🎬 Sakhi
కలలై పోయెను
Advertisement
ప్రేమలే నేరమా ప్రియా ప్రియా వలపు విరహమా ఓ నా ప్రియా మనసు మమత ఆకాశమా ఒక తారై మెరిసిన నీవెక్కడో
Advertisement

కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ మదికి అతిధిగా రానేలనో సెలవైనా అడగక పోనేలనో ఎదురు చూపుకు నిదరేదీ ఊగేను ఉసురే కన్నీరై మనసు అడిగిన మనిషిక్కడో నా పిలుపే అందని దూరలలో ఓ
కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ
అనురాగానికి స్వరమేది సాగరఘోషకు పెదవేది అనురాగానికి స్వరమేది సాగరఘోషకు పెదవేది ఎవరికివారే ఎదురుపడి ఎదలు రగులు ఎడబాటులలో చివరికి దారే మెలికపడి నిను చేరగ నేనీ శిలనైతిని ఎండమావిలో నావను నేనై నిట్టూర్పే నా తెరచాపలే
కలలై పోయేను నా ప్రెమలు అలలై పొంగెను నా కన్నులు
వెన్నెల మండిన వేదనలో కలువ పువ్వుల కలతపడి చేసిన బాసలు కలలైపోతే బతుకే మాయగ మిగులుననీ నీకై వెతిక కౌగిలిని నీడగా మారిన వలపులతో అలసి ఉన్నాను ఆశలతో నను ఓదార్చే నీ పిలుపెన్నడో
కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ
Cast & Crew
🎤SingersSwarnalatha
✍️Lyricsveturi
🎵MusicA.R. Rahman
💫HeroineShalini
🎬DirectorMani Ratnam