2000

హిమసీమల్లో

Hima seemallo hallo

🎬 Annaya
🎤 Vivek Hariharan , Harini🎵 Mani Sharma✍️ veturi
Advertisement
హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలలోయల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా చలివిడిగా కలివిడిగా అందాలారబోశా అలకలూరి రామచిలక పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా చలివిడిగా కలివిడిగా అందాలారబోశా అలకలూరి రామచిలక పలుకగనే
Advertisement

సోసో కాని సోయగమా ప్రియ శోభనమా సుఖ వీణ మీటుదమా వావా అంటే వందనమా అభివందనమా వయసంతా నందనమా మొహమాటమైనా నవ మోహనం చెలగాటమైనా తొలి సంగమం మది వదిలే హిమ మహిమ ఓ అది అడిగే మగతనమా నీదే భామ పడుచు పంచదార చిలక పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో
మామా అంటే మాధవుడే జత మాధవుడే పడనీడు ఎండ పొడి సాసా అంటే సావిరహే బహుశా కలయే నడిజాము జాతరలే వాటేసుకుంటే వాత్సాయనం పరువాల గుళ్ళో పారాయణం రవి కలనే రచన సుమా ఓ సుమతులకే సుమ శతమా నీవే ప్రేమా పెదవి ప్రేమలేఖ ఇదని చదవగనే
హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాల లోయల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధారపోశా చలివిడిగా కలివిడిగా అందాలారబోశా అలకలూరి రామచిలక పలుకగనే