2026

అద్దం ముందు

addham mundhu bhartha mahasayulaku

🎬 Bhartha Mahasayulaku Wignyapthi
అద్దం ముందు
Advertisement
హే చల్లగాలి కావాలంటే చందమామను తీసుకొస్తాడే సన్నజాజి కావాలంటే సంత మొత్తం మోసుకొస్తాడే
Advertisement

అడిగింది అందిస్తాడే అంతకు మించింది తెచ్చిస్తాడే కోరింది తీరుస్తాడే వేరే కోరిక నాకింకా లేకుండా చేస్తాడే
హ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే ఆ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే
నీకు నచ్చిన సంగీతమేంటి నీ చెప్పుల సవ్వడి నువ్వు మెచ్చిన నగలు ఏంటి మెడ వంపున ముద్దు తడి
నీకిష్టమైన చోటు ఏంటి అది చల్లని నీ ఒడి నువ్వు కోరుకున్న దుస్తులేంటి నీ వెచ్చని కౌగిలి నులి వెచ్చని కౌగిలి
నా ఇష్టలేవైనా నీతోనే పెనవేయగా నువ్వు తప్ప ఇంకేవైనా నా కంటికి కనిపించునా
హొయ్ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే
హే నీకు నచ్చిన పరిమళమేంటి నీ ఒళ్ళే నిలువెల్లా నువ్వు మెచ్చిన పెయింటింగ్ ఏంటి గుండె కంటిన బొట్టు బిల్లా
నువ్వు రోజు చదివేదేంటి నీ పరువాల పత్రికని నువ్వు చోడొద్దు అనుకున్నదేంటి నీ కన్నుల నీటిని నీలి కన్నుల నీటిని
ఎవ్వరి ప్రాణాలు వాళ్ళు చూసే విలే లేదు కానీ నా పంచ ప్రాణాల రూపాన్ని నీలో చూస్తున్నా
హొయ్ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే
Cast & Crew