1996

ఎటో వెళ్ళిపోయింది

Yeto Vellipoindi

🎬 Ninne Pelladata
🎤 Rajesh🎵 Sandeep Chowta✍️ Sirivennela Seetharama Sastry
Advertisement
ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయసు ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురియ్యలేవా ఏమైందో
Advertisement

ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటెళ్ళిందో అది నీకు తెలుసు ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురియ్యలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో
ఏ స్నేహమూ కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదు
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో
ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయసు ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురియ్యలేవా ఏమైందో
కలాలన్నవి కొలువుండని కనులుండి ఏం లాభమంది ఏ కదలికా కనిపించని శిలలాంటి బ్రతుకెందుకంధీ
తోడు ఒకరంటే జీవితం ఏంతో వెడుకౌతుంది అంటూ
ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయసు ఓ చల్లగాలి ఆచూకీ తీసి కబురియ్యలేవా ఏమైందో