2006

ఏకాంతంగా

yekantanga

🎬 Ashok
ఏకాంతంగా
Advertisement
ఏకాంతంగా ఉన్న ఎందరి మధ్యన ఉన్న నీకై నేను ఆలోచిస్తున్న ఏ పని చేస్తూ ఉన్న ఎటు పయనిస్తూ ఉన్న నిన్నే నేను ఆరాధిస్తున్న
Advertisement

ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్న నిలువెల్లా కల్లై నీ కోసం చూస్తూ ఉన్నా
ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్న నీ పెదవుల పిలుపుల కోసం పడి చస్తున్నా నా తనువంతా మనసై ఉన్న
ఏకాంతంగా వున్నా ఎందరి మధ్యన ఉన్న
రాయని లేఖలు ఎన్నో నా అరచేతుల్లో ఇంకా చెప్పని సంగతులెన్నో నా ఎద గొంతుల్లో కురవని చినుకులు ఎన్నో పెదవుల మేఘం లో ఇంకా తిరగని మలుపులు ఎన్నో జత పడు మార్గం లో
మనసైన ఆకర్షణలో మునకేస్తున్న ప్రియమైన సంఘర్షణలో పులకిస్తున్న నా వయసెంత వలపై వున్నా
ఏకాంతంగా వున్నా ఎందరి మధ్యన ఉన్న
స్పందన నేనై ఉంటా నీ హృదయం లోన చల్లని లాలన నేనై ఉంటా నీ అలసట లోన అర్చన నేనై ఉంటా నీ వోడి గుడి లోన వెచ్చని రక్షణ నేనై ఉంటా వోడి దుడుకుల్లోన
నీ జీవన నది లో పొంగే నీరవుతున్న సంతోషం ఉప్పొంగే కన్నీరవుతున్న సత్తా జన్మల ప్రేమవుతున్న
ఏకాంతంగా వున్నా ఎందరి మధ్యన ఉన్న
Cast & Crew
🎤SingersKaarunya
✍️LyricsChandrabose
🎵MusicMani Sharma
HeroJr NTR
💫HeroineSameera Reddy
🎬DirectorSurender Reddy