2024

ఏ మాయ ఉందో

Ye Maya Undo

🎬 Ye Maya Undo
🎤 Kapil Kapilan , Sireesha Bhagavathula🎵 Nimshi Zacchaeus✍️ Suresh Banisetti
Advertisement
కంటి రెప్పే వెయ్యకుండా కొంటె చూపే గుచ్చావే కళ్ళనిండా రంగు రంగు కలలు రేపావే
Advertisement

చప్పుడైనా చెయ్యకుండా గుండెలోకి వచ్చావే గుండెల్లోనా చప్పుడంతా నువ్వై పోయావే
నీలో నీలో నేనేమా నిదురించడం నాలో నాలో నువ్వేననుకోవడం
ఎంతలా బాగున్నదో మనలోనా ఈ సంబరం ప్రేమలో పడనోళ్ళకి తెలియదులే
ఏ మాయ ఉందో ఏ మైకముందో ఈ ప్రేమలోనా ఇంకేం దాగుందో యాలె యాలె యాలె యాలె లల్లయాలే యాలె యాలె యాలె యాలె లల్లలెలె లేలే
పిచ్చెక్కుతుందో మత్తెక్కుతుందో ఈ ప్రేమలో ఏం గమ్మత్తు ఉందో యాలె యాలె యాలె యాలె లల్లయాలే యాలె యాలె యాలె యాలె లల్లలెలె లేలే
నువ్వంటే ఎంతో ఇష్టం ఇష్టం ఎంతంటే తెలుపుట కష్టం నువ్వు లేని ఒక్కో నిమిషం అయిపోదా ఒక్కో నరకం
గుండెలో నీ ప్రేమని కళ్ళలో చూసానులే అందుకే నీ చేతిలో ఒదిగి పొయాలే
నువ్విలా ఓ నావలా దారినే చూపావులే ఎప్పుడూ నీ నీడలో సాగిపోతాలే
లోకంలో ఎవ్వరి పేరు పేరు గురుతైనా రానే రాదూ నీ పేరే నీ పేరే మరువాలన్నా మరువాలన్నా ఆ విషయం గురుతే రాదూ
ఇంతలో ప్రేమించితే మనసులో చోటుంచితే జన్మలో నీ చేయిని విడిచిపోనంటా
నువ్విలా ఏడడుగులే కలిసి వేస్తావే ఇటే ప్రాణమే నీ తోడుగా పంపుతానంటా