2026

విష్ణు విన్యాసం

vishnu vinyasam vishnu

🎬 Vishnu Vinyasam
విష్ణు విన్యాసం
Advertisement
చాదస్తం అంటే ఏంటో అడగండి చాట్ జిపిటి వీడి పేరే చెబుతుండండి పంచాంగాలకే పద్ధతి నేర్పే గురుడండి మూఢ నమ్మకాలకు అమ్మ మొగుడు వీడేనండి
Advertisement

ఎవడి మాట వినడండి బై బర్తు ఇంతేనండి ఉంగరాలకి పచ్చరాళ్లకి ఫ్రెండండి
ప్లానెట్స్ కే పెద్ద ఫ్యాన్ అండి అంకెలాంటే బహు పిచ్చండి వీడు నచ్చి మెచ్చిన సబ్జెక్ట్ యే వాస్తాండి
దేఖో విష్ణు విన్యాసం వీడి విచిత్ర విన్యాసం వాస్తు న్యూమరాలజీ అస్ట్రాలజీలు కనిపెట్టిందే వీడి కోసం
దేఖో విష్ణు విన్యాసం వీడి విచిత్ర విన్యాసం గుడ్డి నమ్మకాలని ఎవరన్నా అందులోనే వీడి దిన సంతోషం
అష్టదిక్కులు అచ్చి రావని ఏ సిద్ధాంతైనా చెబితే ఏకంగా వీడు నిల్చుని కూడా నిద్దురోటాడు
నవ గ్రహాలకు పోయే నాసా రాకెట్ ఉంటే వీడు అక్కడికే పోయి పూజలు చేసి కాకాపడతాడు
రాహు కాలం యమగండం చూడనిదే బండి తీయడుగా పిల్లి శకునం బల్లి శాస్త్రం ఈ ఒక్క దాన్ని వదలడుగా
సిటీ బస్ సీట్ అయినా వాస్తు చూసిగానే కూర్చోడు పెగ్గు మీద పెగ్గు ఎన్నైనా లక్కీ నంబరుకి తగ్గడు వీడు
ఓ రేంజ్ దాకా జ్యోతిష్యాన్ని నమ్మకం అంటారు ఇలాంటివాడిని చూస్తే దాన్ని పూనకం అంటారు
ఎలాంటీ ముహూర్తం చూసి వీడిని కన్నారో పెద్దోళ్ళు భూగ్రహణం మనకి మళ్ళీ దొరకదు ఇలాంటీ క్రేజీ స్టారు
దేఖో విష్ణు విన్యాసం వీడి విచిత్ర విన్యాసం వాస్తు న్యూమరాలజీ అస్ట్రాలజీలు కనిపెట్టిందే వీడి కోసం
దేఖో విష్ణు విన్యాసం వీడి విచిత్ర విన్యాసం గుడ్డి నమ్మకాలని ఎవరన్నా అందులోనే వీడి దిన సంతోషం
Cast & Crew
🎤SingersSrikrishna
✍️LyricsRamajogayya Sastry
🎵MusicRadhan
💫HeroineNayan Sarika