Advertisement
వెన్నంటే ఉంటున్నా కడదాకా వస్తున్నా
నా ప్రాణం నీదన్నా ప్రేమ
నీ నవ్వుల తానాన
నేనెపుడో పడిపోయా
తప్పంతా నీదేగా ప్రేమ
అరకొరగా సరిపోనా కసరకలా సరే పోనా
కోపంగా చూస్తున్నా నీ నవ్వై నే రానా
Advertisement
బస్సెక్కిన నెరజాణ
ఆకే దిల్ మే బస్ జానా
మిస్సయిన మిస్సైల్‌లాగ
నాపై ఫైరేలా
అటు ఇటు ఎటు పరిగెడుతున్నా
వెనుతిరిగితే నేనే ఉన్నా
అలుపెరుగని సూర్యుణ్నేనే
నాతో పంతాలా
పారిపోతే నువ్వు డే టైమ్‌లో
ఉన్నట్టేలే నా ఒళ్లో
జారిపోతే రాతిరి రహదారుల్లో
మూనై రానా మఫ్టీలో
కదిలించే నిదురవనా బాధించే హాయినవనా
కలబడితే గెలుపవనా
విసురుగ నన్నే విసిరేసినా
నను తరిమే తరమవునా
నిను తడిమే తరమవనా
చుక్కల్లో దాక్కున్నా నీ పక్కన నేనున్నా
ఉరికే నది ఎటుచూస్తున్నా నే లేనా
ఊ అంటే నిజమౌతా కాదంటే కలనౌతా
వద్దన్నా ఎదురౌతా లేమా
స్వర్గంలో నేనుంటా నీకోసం చూస్తుంటా
మొదలైన మరుజన్మ మారదులే నీ ఖర్మ