2023

వీడు

Veedu

🎬 Tiger Nageswara Rao
🎤 Anurag Kulkarni🎵 G. V. Prakash Kumar✍️ Chandrabose
Advertisement
పంతం కోసం ఆకలే వీడు అధికారం కోసం మోహమే వీడు ఐశ్వర్యం కోసం అత్యాశే వీడు
Advertisement

అందరు ఆగిపోయిన చోట మొదలౌతాడు వీడు అందరిని భయపెట్టే చీకటినే భయపెడతాడు వీడు
అవసరమనుకుంటే తన నీడను వదిలేస్తాడు వీడు సచ్చిపోయేటప్పుడు ఏదో తీసుకుపోయే వాడు వీడు
హే నన్నన్నే నన్నన్నే తన్నే నానే నానే తా నన్నన్నే నానే నానే నానా హే నన్నన్నే నన్నన్నే తన్నే నానే నానే తా నన్నన్నే నన్నెన్నానే నానా
వీడు హా వీడు హా ఎదురొచ్చిన వాన్ని తొక్కేస్తాడు వీడు వీడు హా వీడు హా ఎదిరించిన గొంతు నొక్కేస్తాడు వీడు వీడు హా వీడు హా ఎదగడమే జన్మహక్కంటాడు వీడూ
కామం అంటే కోరుకోవడం కోరిక లేని బ్రతుకే శూన్యం కరుణే లేని ఈ కలంలో క్రోధం అన్నది కాచే కవచం
నష్టం చేసే నలుగురిలోన లోభం అన్నది ఎంతో లాభం మెత్తగ ఉంటే మొత్తేస్తారు మదమే ఇప్పుడు ఆమోదం
వేడికి వేడే శీతలం మత్సరమే మంచి ఔషధం దుర్జనులుండే ఈ లోకంలో దుర్గుణమే సద్గుణమంటాడు వీ–డు
నన్నన్నే నన్నన్నే తన్నే నానే నానే తా నన్నన్నే నన్నెన్నానే నానా
వీడు హా వీడు హా ఎదురొచ్చిన వాన్ని తొక్కేస్తాడు వీడు వీడు హా వీడు హా ఎదిరించిన గొంతు నొక్కేస్తాడు వీడు వీడు హా వీడు హా ఎదగడమే జన్మహక్కంటాడు వీడూ