2021

వచ్చానంటివో

vachhaanantivo

🎬 Sreekaaram
వచ్చానంటివో
Advertisement
వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా దాని ఎధాన దాని ఎధాన దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా
Advertisement

వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద హ్హా కట్టమింద భలే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా దాని ఎధాన దాని ఎధాన దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా
అరెరెరెరే నారి నారి వయ్యారి సుందరి నవ్వు మొఖముదానా నారీ నారీ వయ్యారి సుందరి నవ్వు మొఖముదానా నీ నవ్వు మొఖం నీ నవ్వు మొఖం నీ నవ్వు మొఖంమింద నంగనాచి అలక భలేగుంది బాలా నీ నవ్వు మొఖంమింద నంగనాచి అలక భలేగుంది బాలా
వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా
హో ఓ ఓ హో ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ అరరే అరరే అరె అరె అరె అరె
తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులక మంచం తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులక మంచం అల సందా పోవ్వ నీకు అలక ఏలనే అగుడు సేయ తగునా అల సందా పోవ్వ నీకు అలక ఏలనే అగుడు సేయ తగునా
వచ్చానంటివో అరె వచ్చానంటివో ఓ ఓఓ వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా (ఏ బాలా) దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా
అరెరెరెరే సురుకు సూపు సొరకత్తులిసరకే సింత ఏల బాలా సురుకు సూపు సొరకత్తులిసరకే సింత ఏల బాలా కారమైన ముది కారామైన ముది కారమైన మూతి ఇరుపులు భలేగున్నయే బాలా నీ అలక తీరనూ ఏమి భరణము ఇవ్వగలను భామ
ఎన్నెలైన ఏమంత నచ్చదూ ఊ ఊఊ ఎన్నెలైన ఏమంత నచ్చదూ నువ్వు లేని చోటా ఎన్నేలైన ఏమంత నచ్చదూ నువ్వు లేని చోటా నువ్వు పక్కనుంటే నువ్వు పక్కానుంటే నువ్వు పక్కనుంటే ఇంకేమి వద్దులే చెంత చేర రావా ఇంకనైన పట్టించుకుంటనని మాట ఇవ్వు మావా తుర్రుమంటు పైకెగిరిపోద్ది నా అలక సిటికలోన
Cast & Crew
🎤SingersPenchal Das
✍️LyricsPenchal Das
HeroSharwanand
💫HeroinePriyanka Mohan
🎬DirectorKishor B