Advertisement
వానా వానా వెల్లువాయే
కొండా కోనా తుళ్ళిపోయే
Advertisement
చెలియ చూపులే
చిలిపి ఝల్లులై
మేను తాకగా
ఏదో ఏదో ఏదో హాయి
వానా వానా వెల్లువాయే
కొండా కోనా తుళ్ళిపోయే
ప్రియుని శ్వాసలే
పిల్ల గాలులై
మోము తాకగా
ఏదో ఏదో ఏదో హాయి
చక్కని చెక్కిలి చిందే
అందపు గంధం
పక్కన చేరిన మగ
మహారాజుకి సొంతం
హో తొలకరి చిటపట
చినుకులలో మకరందం
చిత్తడి పుత్తడి
నేలకదే ఆనందం
చిగురుటాకులా
చలికి వణుకుతూ
చెలియా చేరగా
ఏదో ఏదో ఏదో హాయి
వానా వానా వెల్లువాయే
కొండా కోనా తుళ్ళిపోయే
ఒకరికి ఒకరై
హత్తుకు పోయిన వేళా
వొడిలో రేగెను
ఏదో తెలియని జ్వాలా
ముసిరిన చీకటిలో
చిరుగాలుల గోలా
బిగిసిన కౌగిట
కరిగించెను పరువాల
కలవరింతలే
పలకరింపులై
పదును మీరగా
ఏదో ఏదో ఏదో హాయి
వానా వానా వెల్లువాయే
కొండా కోనా తుళ్ళిపోయే
చెలియా చూపులే
చిలిపి ఝల్లులై
మేను తాకగా
ఏదో ఏదో ఏదో హాయి
వానా వానా వెల్లువాయే
కొండా కోనా తుళ్ళిపోయే
ప్రియుని శ్వాసలే
పిల్ల గాలులై
మోము తాకగా
ఏదో ఏదో ఏదో హాయి
లాలాలాల లాలాలాల హా
లాలాలాల లాలాలాల హూ
లాలాలాల లాలాలాల