2019

ఉండిపో ఉండిపో

undipo undipo ismart

🎬 iSmart Shankar
ఉండిపో ఉండిపో
Advertisement
ఉండిపో ఉండిపో చేతిలో గీతాలా ఎప్పుడూ ఉండిపో నుదిటి పై రాతలా
Advertisement

ఉండిపో ఉండిపో కళ్ళలో కాంతిలా ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా నీతోనే నిండిపోయే నా జీవితం వదిలేసి వెళ్ళనంది ఏ జ్ఞాపకం
మనసే మొయ్యలేనంతలా పట్టి కొలవలేనంతలా విప్పి చెప్పలేనంతలా హాయే కమ్ముకుంటోందిగా
ఏంటో చంటి పిల్లాడిలా నేనే తప్పిపోయానుగా నన్నే వెతుకుతూ ఉండగా నీలో దొరుకు తున్నానుగా
ఉండిపో ఉండిపో చేతిలో గీతాలా ఎప్పుడూ ఉండిపో నుదిటి పై రాతలా
సరి కొత్త తడబాటే మారింది అలవాటులాగా ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఒక మాటు రావా
మెడ వంపు తాకుతుంటే ముని వేళ్ళతో బిడియాలు పారిపోవా ఎటు వైపుకో
ఆహా సన్నగా సన్నగా సన్నా జాజిలా నవ్వగా ప్రాణం లేచి వచ్చిందిగా మళ్ళీ పుట్టినట్టుందిగా
ఓహో మెల్లగా మెల్లగా కటుక్కల్లనే తిప్పగా నేనో రంగుల రాట్నమై చుట్టూ తిరుగుతున్నానుగా
తల నిమిరే చనువౌతా నువ్ గాని పొలమారు తుంటే ఆ మాటే నిజమైతే ప్రతిసారి పొలమారిపోతా
అడగాలి గని నువ్వు అలవోకగా నా ప్రాణమైన ఇస్తా అడగొచ్చుగా
ప్రాణం నీదని నాదని రెండూ వేరుగా లేవుగా ఎపుడో కలుపుకున్నాం కదా విడిగా ఉండలేనంతగా
ఉందాం అడుగులో అడుగులా విందాం ప్రేమలో గల గల బంధం బిగిసిపోయిందిగా అంతం కాదులే మన కథా
Cast & Crew
✍️LyricsBhaskarabhatla
🎵MusicMani Sharma
🎬DirectorPuri Jagannadh