2021

తట్టుకోలేదే

thattukoledey

🎬 Thattukoledey
తట్టుకోలేదే
Advertisement
నా చెయ్యి పట్టుకోవా నన్నొచ్చి చుట్టుకోవా నాతోనే ఉండిపోవా
Advertisement

కన్నుల్లో నిండిపోవా గుండెల్లో ఉండిపోవా నిలువెల్లా ఇంకిపోవా
ఓ చెలి కోపంగా చూడకే చూడకే ఓ చెలి దూరంగా వెళ్ళకే నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే అంతలాగ కప్పుకున్నదే నీ ఊహనే
నాలో పండగంటే ఏమిటంటే నిన్ను చూస్తూ ఉండడం నాలో హాయి అంటే ఏమిటంటే నీతో నడవడం నాలో భారం అంటే ఏమిటంటే నువ్వు లేకపోవడం నాలో మరణం అంటే ఏమిటంటే నిన్ను మరవడం ఓ చందమామ చందమామ ఒక్కసారి రావా నా జీవితాన మాయమైన వెన్నెలంతా తేవా మనవి కాస్త ఆలకించి ముడిపడవా
నీ చూపులే అగ్గిరవ్వలై అగ్గిరవ్వలై బగ్గుమంటూ దూకుతున్నాయే నా మీదకి నా ఊపిరి అందులో పడి కాలుతున్నదే కొద్దిగైనా కబురు పెట్టు నవ్వు మేగానికి
నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే అంతలాగ కప్పుకున్నదే నీ ఊహనే
నే నిన్ను చూడకుండా నీ నీడ తాకకుండా రోజులా నవ్వగలనా నీ పేరు పలకకుండా కాసేపు తలవకుండా కాలాన్ని దాటగలనా గుండెలో ఏం ఉందొ కళ్ళలో చూడవా నిన్నలా నాతోనే ఉండవా
నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే అంతలాగ కప్పుకున్నావే నా దారిని
వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే వెళ్లిపోవద్దే వెళ్లిపోవద్దే వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే వెళ్లిపోవద్దే వొద్దే వొద్దే వెళ్లిపోవద్దే వెళ్లిపోవద్దే
Cast & Crew
✍️LyricsSuresh Banisetti
💫HeroineDeepthi Sunaina
🎬DirectorNA