Advertisement
తానే నేనో నేనే తానో ఏమో ఏమో ప్రేమేనేమో
తానేగా పలికింది నాతో ఇలా నేనంటే ఎంతో ఇష్టమంటూ
ఈరోజే తెలిసింది నాకూ ఇలా తన చిన్ని గుండెల్లో
చప్పుడులా నేనున్నానంటూ
Advertisement
ఇప్పటికిప్పుడు ఊహల్లో నను నేనే ఎగరేసాలే
నువ్వే ఎవరను అద్దంతో యుద్ధం చేశాలే
ఎప్పటికప్పుడు గాలుల్లో నీ పేరుని రాస్తున్నాలే
రెప్పల దుప్పటి విప్పానో అందంగా నీ కలలే
తానే నేనో నేనే తానో
ఏమో ఏమో ప్రేమేనేమో
బళ్ళో పాఠంలా గుళ్లో దీపంలా
నాలో నువ్వున్నా ఇన్నాళ్లు నే మరిచానా
నాడే నీతోనా సాగే పయనాన
తోడై నడిచానా నేడే చూశానా
వినవే వినవే మనసా మనసా
తనవే తనవే ఈ ఊసులే
మాటలే రాని పెదవులు పట్టి తీయగా కొన్ని పలుకులు చుట్టి
గుండెలో ప్రేమ పాటకు ప్రాణం పోసావులే
ఇప్పటికిప్పుడు ఊహల్లో నను నేనే ఎగరేసాలే
నువ్వే ఎవరను అద్దంతో యుద్ధం చేశాలే
ఎప్పటికప్పుడు గాలుల్లో నీ పేరుని రాస్తున్నాలే
రెప్పల దుప్పటి విప్పానో అందంగా నీ కలలే
తానే నేనో నేనే తానో
ఏమో ఏమో ప్రేమేనేమో