2021

తానే నేనో

thaane neno nede

🎬 Nede Vidudala
తానే నేనో
Advertisement
తానే నేనో నేనే తానో ఏమో ఏమో ప్రేమేనేమో తానేగా పలికింది నాతో ఇలా నేనంటే ఎంతో ఇష్టమంటూ ఈరోజే తెలిసింది నాకూ ఇలా తన చిన్ని గుండెల్లో చప్పుడులా నేనున్నానంటూ
Advertisement

ఇప్పటికిప్పుడు ఊహల్లో నను నేనే ఎగరేసాలే నువ్వే ఎవరను అద్దంతో యుద్ధం చేశాలే ఎప్పటికప్పుడు గాలుల్లో నీ పేరుని రాస్తున్నాలే రెప్పల దుప్పటి విప్పానో అందంగా నీ కలలే
తానే నేనో నేనే తానో ఏమో ఏమో ప్రేమేనేమో
బళ్ళో పాఠంలా గుళ్లో దీపంలా నాలో నువ్వున్నా ఇన్నాళ్లు నే మరిచానా నాడే నీతోనా సాగే పయనాన తోడై నడిచానా నేడే చూశానా
వినవే వినవే మనసా మనసా తనవే తనవే ఈ ఊసులే మాటలే రాని పెదవులు పట్టి తీయగా కొన్ని పలుకులు చుట్టి గుండెలో ప్రేమ పాటకు ప్రాణం పోసావులే
ఇప్పటికిప్పుడు ఊహల్లో నను నేనే ఎగరేసాలే నువ్వే ఎవరను అద్దంతో యుద్ధం చేశాలే ఎప్పటికప్పుడు గాలుల్లో నీ పేరుని రాస్తున్నాలే రెప్పల దుప్పటి విప్పానో అందంగా నీ కలలే
తానే నేనో నేనే తానో ఏమో ఏమో ప్రేమేనేమో
Cast & Crew
🎤SingersAnurag Kulkarni
✍️LyricsSri Mani
🎵MusicAjay Arasada
HeroAsif Khan
💫HeroineMouryani