2016

తాను నేను

Taanu Nenu

🎬 Sahasam Swasaga Sagipo
Advertisement
తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శశి తానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వె తెలుగు తీపి తాను నేను మనసు మాను
Advertisement

దారి నేను తీరం తాను దారం నేను హారం తాను దాహం నేను నీరం తాను కావ్యం నేను సారం తాను నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను
తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను గానం గమకం తాను నేను ప్రాయం తమకం తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శశి తానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వె తెలుగు తీపి తాను నేను మనసు మేను మనసు మేను మనుసు మేను
Cast & Crew
🎤SingersVijay Prakash
✍️LyricsAnanta Sriram
🎵MusicA.R. Rahman
💫HeroineManjima Mohan