Advertisement
నిన్నే చూసిన నిన్నే చూసిన
నిజమేనా నిన్నే చూసిన
నీతోనే ఉన్న నీలో దాగున్న
వెలుగులనే నేడే చూసిన
నాకు నేనే ఎంత చెప్పిన నమ్మలేకపోతున్నా
నమ్మలేనిదేముందే నాలో నైజం నాకుందే
గుండెల్లోనా సత్యం సత్యం లాగ మాటల్లోకి మారిందే
సుర సుర
సుర సుర నీ పరాక్రమం జన గానాన్ని నడిపేన
నారా నర నీ మహోత్సవం తర తరాలు నిలిచేనా
Advertisement
నిన్నే చూసిన నిన్నే చూసానా
నిజమేనా నిన్నే చూసానా
చలి కాలంలోనా పొగమంచై నా మనసు
నీ వేసవి లాంటి శ్వాసను తాకి కరిగింది ఈ రోజు
శతాగ్ని లాంటి నీ హృదయం
గతించి పొద నా బిడియం
తుపాకులైన తలొంచుకోవా హట్టాతుగా నీ తళుక్కు చూస్తే
అనువాస్త్రాలే అంతం కావా నీ అందని అద్దంలో చూస్తే
సుర సుర
సుర సుర నీ పరాక్రమం నా తనాన్ని గెలిచేనా
నారా నర నీ మహోత్సవం నర నరాల్లో నిలిచేనా
నిన్నే చూసానా నిన్నే చూసానా
నిజమేనా నిన్నే చూసానా
ఆవేశంలోన ఓ లవ ఉందేమో
నీ సావాసాన్ని వెన్నెల కూడా కావాలంది
తపస్సు లాంటి నీ ధ్యాస
మనస్సు నీపై నిలిపేసా
హోం జగత్తు మొత్తం శిరస్సు వంచి
మహత్తు ఉన్న సొగసు నీది
నీ వయ్యారం చూస్తూ చూస్తూ నాలో వేగం దాసోహం కాదా
సుర సుర
సుర సుర నీ పరాక్రమం పరవశాలు చిలిలికేనా
నారా నర నీ మహోత్సవం తర తరాలు నిలిచేనా