2024

సూఫియానా

Sufiyana

🎬 Aay
🎤 Ram Miriyala , Sameera Bharadwaj , Ramya Shree🎵 Ajaya Arasada, Ram Miriyala✍️ Sri Mani
Advertisement
ఎవరే పిల్లా అరవిరసిన మల్లా నువ్ ఎవరే పిల్లా తొలకరి చిరుజల్లా
Advertisement

కుదురైన కుర్రాడిని కొరికుదిపేసిందే తీరైన చిన్నోడిని ప్రేమలొ ముంచేసిందే
కన్నే కునుకొదిలేసె కళ్ళల్లో కలువలు పూసె నీ కలలతొ నను కమ్మేసే కనికారం బావుందమ్మా
పెదవే పలుకొదిలేసే నీ మౌనంలో మునకేసే మెలమెల్లగ ప్రాణం తీసే సుకుమారం నీదేలేమ్మా
అరకొరగా చూసే నీ చూపే సరిపడకా నీ దారుల వేచే కలివిడిగా ఆడే నీ మాటే విడిపడనీ ముడి ఎదో ఏసే
సూఫియానా సూఫియానా గుండెల్లోనా ప్రేమవానా
ఏంటమ్మా కులుకా నీ ఎనకే ఎనకే తిరిగాక కాదంటే ఎలగే నిను తీరా వలచాక
ఏంటమ్మా తళుకా అట్టాగే గాలికి వదిలెయ్ కా కాస్తైనా వినవే ఈ పిల్లాడి ఊసింత
చీకటినెరుగవు నీ నయనాలు వెలుతురులూరగ నీ కనుచూపులు శీతలమౌనే ఆ పవనాలు సోకినా చాలే నీ పాదాలు
నీ వలనే అలలు గోదారినా వదిలెయ్ కే నన్ను నాదారినా నీ చలవే జాబిలై నింగినా ఈ నేలకు వెన్నెలై జారినా
సూఫియానా సూఫియానా గుండెల్లోనా ప్రేమవానా