2021

సూ సూడు హీరోలు

Soo Soodu Herolu

🎬 Jathi Ratnalu
🎤 Rahul Sipligunj🎵 Radhan✍️ Kasarla Shyam
Advertisement
సూ సూడు హీరోలు ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు
Advertisement

శాటిలైట్ కైనా చిక్కరు వీళ్లో గల్లీ రాకెట్లు డైలీ బిళ్ళగేట్స్ కి మొక్కే వీళ్ళై చిల్లుల పాకెట్లు సుద్దాపూసలు సొంటే మాటలు తిండికి తిమ్మ రాజులు పంటే లేవరు లేస్తే ఆగరు పనికి పోతరాజుల
సూ సూడు హీరోలు ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు
వీళ్ళతోటి పోల్చామంటే ధర్నా చేస్తై కోతులు వీళ్ళుగాని జపం చేస్తే దూకి చస్తై కొంగలు ఊరిమీద పడ్డారంటే ఉరేసుకుంటై వాచీలు వీళ్ళ కండ్లు పడ్డయంటే మిగిలేదింకా గోచీలు పాకిస్థానుకైనా పోతరు ఫ్రీ వైఫై చూపిస్తే బంగ్లాదేశ్ కైనా వస్తరు బాటిల్ నే ఇప్పిస్తే
ఇంగిలా రంగ బొంగరం ఏతేస్తాడు బొంగరం వీళ్ళను గెలికినొడి బతుకు చూస్తే భయంకరం వీనికి బాటన్ సె కామ్ ఖరాబ్ రతికి కామం సె నేను ఖరాబ్ వీళ్ళను బాగుచేద్దామనోడి దిమాక్ ఖరాబ్
సూ సూడు హీరోలు ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు
వీళ్ళు రాసిన సప్లిమెంట్లతో అచ్చెయ్యొచ్చు పుస్తకం వీళ్ళ కథలు జెప్పుకొని గడిపేయొచ్చు ఓ శకం గిల్లి మరీ లొల్లి పెట్టే సంటి పిల్లలు అచ్చము పిల్లి వీళ్ళ జోలికి రాదు ఎయ్యరు గనక బిచ్చము ఇజ్జత్కి సవాలంటే ఇంటి గడప తొక్కరు బుద్ధి గడ్డి తిన్నారంటే దొడ్డి దారి ఇడవరు
భోళా హరిలోరంగ ఆ మొఖం పంగనామాలు వాలకం మూడే పాత్రలతో రోజు వీధి నాటకం శంభో లింగ ఈ త్రికం గప్పాలు అర్రాచకం బాబో ఎవనికి మూడుతుందో ఎట్టా ఉందో జాతకం
సూ సూడు హీరోలు ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు