2021

సిలకా ముక్కు

Silaka Mukku

🎬 Divi folk song
🎤 Harika Narayan🎵 Madeen S K✍️ Shyam Kasarla
Advertisement
సిలకా ముక్కు దాన అని ముద్దుగా పీలుస్తాడే వాడు సింతా పూల సీర సాటుంగ తెచ్చిస్తాడే
Advertisement

సిలకా ముక్కు దాన అని ముద్దుగా పీలుస్తాడే వాడు సింతా పూల సీర సాటుంగ తెచ్చిస్తాడే రాగి వన్నెల రైకవీగీత కుట్టిస్తాడే సీర కట్టుకుంటే నన్నే నువ్వే సుట్టుకున్నావంటాడే ఏ ఏఏ ఏ
ఒక్కటొక్కటొక్క టోక్కటొక్కటొక్క టొక్కటొక్కటి వాడు లెక్కపెట్టి ముద్దులిచ్చే నూట ఒక్కటి ఒక్కటొక్కటొక్క టోక్కటొక్కటొక్క టొక్కటొక్కటి వాడు నవ్వుతుంటే ఎలిగిపోద్ది సిమ్మసీకటి
జుత్తు పొల్లగాడే ఎలుమొళ్ళ జీతగాడే పొద్దు పొద్దుగాల్నే సూర్యుడై వచ్చేస్తాడే జుత్తు పొల్లగాడే ఎలుమొళ్ళ జీతగాడే పొద్దు పొద్దుగాల్నే సూర్యుడై వచ్చేస్తాడే గొళ్ళెం పెట్టిన దర్వాజా మెల్లంగ తీస్తాడే పిల్లి లెక్క యెనక నుంచి కండ్లు మూసేస్తాడే ఏ ఏ ఏ ఏ
ఒక్కటొక్కటొక్క టోక్కటొక్కటొక్క టొక్కటొక్కటి వాడు లెక్కపెట్టి ముద్దులిచ్చే నూట ఒక్కటి ఒక్కటొక్కటొక్క టోక్కటొక్కటొక్క టొక్కటొక్కటి వాడు నవ్వుతుంటే ఎలిగిపోద్ది సిమ్మసీకటి
జాదూ పోరగాడే జాతర రమ్మంటాడే నా రంగుల రాట్నం నువ్వేనని ఒళ్ళో కూసుంటాడే జాదూ పోరగాడే జాతర రమ్మంటాడే నా రంగుల రాట్నం నువ్వేనని ఒళ్ళో కూసుంటాడే
లబ్బారు గాజులు తెచ్చి దబ్బున సేతికి తొడుగుతాడే ఘల్లునా గజ్జెలు పట్టీలు కట్టి కాళ్లకు మొక్కుతాడే ఏ ఏఏ ఏ
ఒక్కటొక్కటొక్క టోక్కటొక్కటొక్క టొక్కటొక్కటి వాడు లెక్కపెట్టి ముద్దులిచ్చే నూట ఒక్కటి ఒక్కటొక్కటొక్క టోక్కటొక్కటొక్క టొక్కటొక్కటి వాడు నవ్వుతుంటే ఎలిగిపోద్ది సిమ్మసీకటి
శాపాలు పట్టుకొచ్చి నీ సూపుల సిక్కినయంటడే వండి పెడితే సాలు అవి పులుసై పుట్టుతాయంటాడే శాపాలు పట్టుకొచ్చి నీ సూపుల సిక్కినయంటడే వండి పెడితే సాలు అవి పులుసై పుట్టుతాయంటాడే ఏలు పట్టుకుంటే సాలు లోకం ఏలుతానంటాడే వాడు మూలకు పడే దాకా నాకు సాకిరి చేస్తానంటాడే ఏ ఏ ఏ ఏ
ఒక్కటొక్కటొక్క టోక్కటొక్కటొక్క టొక్కటొక్కటి వాడు లెక్కపెట్టి ముద్దులిచ్చే నూట ఒక్కటి ఒక్కటొక్కటొక్క టోక్కటొక్కటొక్క టొక్కటొక్కటి వాడు నవ్వుతుంటే ఎలిగిపోద్ది సిమ్మసీకటి