2020

సరిలేరు నీకెవ్వరూ

sarileru neekevvaru sarileru

🎬 Sarileru Neekevvaru
సరిలేరు నీకెవ్వరూ
Advertisement
భగ భగ భగ భగ మండే నిప్పుల వర్షమొచ్చినా జన గణ మన అంటూనే దుకే వాడే సైనికుడూ
Advertisement

పెళ పెళ పెళ పేలమంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగేయ్ లేదంటూ దాటే వాడే సైనికుడూ
దడ దడ దడమంటూ తూటాలు దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపే వాడే సైనికుడు
మారణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడూ
సరిలేరు నీకెవ్వరూ నువ్వెళ్ళే రహదారికి జోహారు ఓఓఓ
సరిలేరు నీకెవ్వరూ ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు
కోట్ల మంది గుండెల్లో దేర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు
ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నావాళ్లంటూ కులం మతం బేధాలను భస్మం చేసేవాడే సైనికుడు
చెడూ జరగని పాగా పెరగని బెదరిదగని సైనికుడు అలుపెరగని రక్షణ పని చెదరనివ్వని సైనికుడు
మారణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడూ
సరిలేరు నీకెవ్వరూ నువ్వెళ్ళే రహదారికి జోహారు ఓఓఓ
సరిలేరు నీకెవ్వరూ ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు
Cast & Crew
🎤SingersDevi Sri Prasad
✍️LyricsDevi Sri Prasad
🎬DirectorAnil Ravipudi