Advertisement
సంధ్యా పదపద పదమని అంటే సిగ్గే ఆపిందా
బావా అని పిలిచేందుకు మొహమాటంతో ఇబ్బందా
Advertisement
నువు వణక్క తొనక్క బెరక్క సరిగ్గ ఉంటే చాలే
కథ వెనక్కి జరక్క చురుగ్గ కొలిక్కి త్వరగా వస్తాదే
ఇది వయస్సు విపత్తు ఒకింత తెగించి ఉంటే మేలే
విధి తరించి తలొంచి కరెక్టు ముగింపు ఇపుడే ఇస్తాదే
మధ్యలో ఉన్నది దగ్గరో దూరమో కాస్తాయినా తెలిసిందా
ఎంతకీ తేలనీ ప్రేమలో తేలడం ఏమైనా బాగుందా ఆఆ
మాటలని కుక్కేశావే మనసు నిండా
వాటినిక పంపేదుందా పెదవి గుండా
బిడియంతో సహవాసం ఇక చాలు బాలిక
అది ఎంతో అపచారం అని అనుకోవే చిలకా
సంధ్యా పదపద పదమని అంటే సిగ్గే ఆపిందా
బావా అని పిలిచేందుకు మొహమాటంతో ఇబ్బందా
ఏం సరిపొద్దే నువు చూపే ప్రేమా
ఓ తెగ చూస్తే పనులేవీ కావమ్మా
పైకలా అవుపిస్తాడే ఎవరికైనా
వాడికీ ఇష్టం ఉందే తమరిపైనా
విసిరావో గురిచూసి వలపన్న బాణమే
పడిపోదా వలలోనా పిలగాడి ప్రాణమే
సంధ్యా పదపద పదమని అంటే సిగ్గే ఆపిందా
ఔనే పొగరును ప్రేమతో మనిషిని చేస్తే మీ బావే
నువు వణక్క తొనక్క బెరక్క సరిగ్గ ఉంటే చాలే
కథ వెనక్కి జరక్క చురుగ్గ కొలిక్కి త్వరగా వస్తాదే
ఇది వయస్సు విపత్తు ఒకింత తెగించి ఉంటే మేలే
విధి తరించి తలొంచి కరెక్టు ముగింపు ఇపుడే ఇస్తాదే