2018

సమయమా

samayama antariksham 9000

🎬 Antariksham 9000 KMPH
సమయమా
Advertisement
సమయమా అదేమిటంత తొందరేంటి ఆగుమా సమయమా మరింత హాయి పోగు చేయనీయుమా
Advertisement

చేతిలోన చేతులేసుకున్న చోటులోన చూపు తోటి చూపులల్లుకున్న దారిలోన శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన ఆనంద వర్ణాల సరిగమా
సమయమా సమయమా సమయమా కదలకే క్షణమా
జతపడే ఎదలలో మధురిమా వదులుకోకే వినుమా
ఆ నింగి జాబిల్లిపై యే నీటి జాడున్నదో నే చూడలేనె అపుడే
ఈ నేల జాబిల్లిపై సంతోష భాష్పాలని చూస్తూ ఉన్నానే ఇపుడే
తనే నా సగంగా తనే నా జగంగా స్వరాల ఊయలూగుతుండగా
ఏడేడు లోకాలు ఆరారు కాలాలు ఆ తారా తీరాలు ఆనంద ద్వారాలు
తీసి మురిసే వేళా తీపి కురిసే వేళా ఈ స్వప్న సత్యాన్ని దాటేసి పోనీకు
సమయమా సమయమా సమయమా కదలకే క్షణమా జతపడే ఎదలలో మధురిమా వదులుకోకే వినుమా
Cast & Crew
🎤SingersYazin Nizar ,  Harini
✍️LyricsAnanta Sriram
⭐HeroVarun Tej
🎬DirectorSankalp Reddy