Advertisement
ఓ… ఈ లోకం ఎంతో కొత్తగా మారిపోయే ఈ దినం
ఓ… లోకంలో ఉంది కేవలం నువ్వు నేను ఇద్దరం
Advertisement
గడియారం లేని సమయాలు
కొలమానం లేని సరదాలు
అంతా మనకు సొంతాలు ఆరారిరో…
విసుగంటూ రాని విషయాలు విషయాలే
లేని వివరాలు ఎంతో ఎంతో మధురాలు
ఇలా ఇలా…మొదటిసారి మొదలయిందో
రోమాంచకం…రోమాంచకం..
రోమాంచకం… రోమాంచకం
ఎక్కడున్న నువ్వే జ్ఞాపకం
ఎప్పుడైనా నీదే సంతకం
నువ్వు లేక లేదు వ్యాపకం
లేని చోట అంత నాటకం
కారణమే లేని కథ
కల కాలమిలా నిలుచు కదా
మంచులో కాలిపోవడం
మంటలోన వణకి వణకిపోవడం
మునుగుతూ తేలిపోవడం
ఇలా.. ఇలా.. మొదలయిందో వదిలిపోతే
రోమాంచకం…రోమాంచకం..
రోమాంచకం… రోమాంచకం