1997

పొద్దే రాని లోకం

Podderani Lokam

🎬 Gokulamlo Seeta
Advertisement
పొద్దే రాని లోకం నీది నిద్రేలేని మైకం నీది
Advertisement

పొద్దే రాని లోకం నీది నిద్రేలేని మైకం నీది పాపం ఏ లాలి పాడాలి జాబిలి అయినా ఏదోల వింటుంది నీ మది వేకువనైనా వెన్నెలనైనా చూడని కళ్లే తెరిచేలా ఇలా... నిను లాలించేదా లే లెమ్మని మిత్రమా మిత్రమా మైకమే లోకమా మెల్లగా చల్లగా మేలుకో నేస్తామా
ఎన్నో రుచులు గల బ్రతుకుంది ఎన్నో ఋతువులతో పిలిచింది చేదొక్కటే నీకు తెలుసున్నది రేయోక్కటే నువ్వు చూస్తున్నది ఉదయాలనే వెలివేస్తానంటావా? కలకాలము కలలోనే ఉంటావా నిత్యమూ నిప్పునే తాగినా తీరని నీ దాహం తీర్చే కన్నీరిది
మిత్రమా మిత్రమా మైకమే లోకమా మిత్రమా మిత్రమా శూన్యమె స్వర్గమా
నీలో చూడు మంచి మనసుంది ఏదో నాడు మంచు విడుతుంది వాల్మీకిలో ఋషి ఉదయించినా వేమన్నలో బోగి నిదురించినా మదిలో ఇలా రగలాలి ఓ జ్వాలా మలిణాలనే మసి చేస్తూ మండేలా అగ్నిలో కాలినా స్వర్ణమై తేలగా నిను తాకిందేమో ఈ వేధన
మిత్రమా మిత్రమా మట్టి లో రత్నమా మిత్రమా మిత్రమా మబ్బులో చంద్రమా
పొద్దే రాని లోకం నీది నిద్రేలేని మైకం నీది పాపం ఏ లాలి పాడాలి జాబిలి అయినా ఏదోల వింటుంది నీ మది