2014

పిల్ల ఓ పిల్ల

Pilla O Pilla

🎬 Current Theega
🎤 Karthik🎵 Achu Rajamani✍️ Ramajogayya Sastry
Advertisement
అదిరెను అదిరెను ఎద సడి అదిరెను కలిగెను కలిగెను అలజడి కలిగెను గిరా గిరా తిరిగెడి భూమి నిలిచెను గల గల కదిలేటి గాలి నిలిచెను మనసులో తొలకరి మొక్క మొలిచెను వయసున్న మగసిరి పొద్దు పొడిచెను నర నర నరములు సల సల మరిగెను నిన్న లేని నిప్పు లాంటి తుఫాను
Advertisement

గుండెల్లోనా వెయ్యి వేళా పిడుగులు పగిలెను కోటి కోట్ల మెరుపులా కత్తి దాడి జరిగెను నా పై నా పై నా పై కాళీ కింది నెల కూడా నన్ను వీడి కదిలెను ప్రాణమంతా పిండుతున్న తీపి బాధ రగిలెను ఏమైందో ఏమైందో రెప్ప మూసి తీసేలోగా ఏమైందో చూసేలోగా నాలో నేను లేనే లేను పిల్ల ఓ పిల్ల నా చూపుల్లోనే మెరిసావే పిల్ల ఓ పిల్ల నా ఊపిరి లోన కలిసేవే పిల్ల ఓ పిల్ల నా దేవత నువ్వై నిలిచావే అయ్యో ఓ ఓఓఓ పాద రసమునే పోత పోసి నీ మెరుపు దేహమే మలిచారు పూల పరిమళం ఊపిరి ఊదిన పైకి నిన్నిలా వదిలారు అద్భుతాలు అన్ని ఒక చోటే వెతికి నిన్ను చేరినాయేమో పోలికలు సోలిపోయే రూపం నిధే పిల్ల ఓ పిల్ల నా గుండె తలుపు తట్టావే పిల్ల ఓ పిల్ల నా ప్రేమ దారి పట్టవే పిల్ల ఓ పిల్ల నా కల్లో దీపం పెట్టావే అయ్యో ఓ ఓ
హోరు గాలిలో నెమలి కన్నుల తేలుతోంది మది నీవల్లే జోరు వానలో ఆడుతున్న నా అంతరంగం ఒక హరివిల్లే పసిడి పరువాల పసి పాప మరువదె నిన్ను కను పాప జన్మకే జ్ఞాపకం గ చూసా నిన్నే పిల్ల ఓ పిల్ల నా లోకం లో అడుగెట్టావే పిల్ల ఓ పిల్ల నీ అందం తో పడగొట్టావే పిల్ల ఓ పిల్ల నా కోసమే నువ్వు పుట్టవే అయ్యో ఓ ఓ పిల్ల ఓ పిల్ల నీ అందం దెబ్బ తిన్నానే పిల్ల ఓ పిల్ల నే తేరుకోలేకున్నానే పిల్ల ఓ పిల్ల నీ ప్రేమలో పడుతున్నానే అయ్యో ఓ ఓ ఓ