2000

పలికే గోరింకా

Palike Gorinka

🎬 Priyuraalu Pilichindi
🎤 Sadhana Sargam🎵 A.R. Rahman✍️ Shivaganesh
Advertisement
పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా
Advertisement

పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా
అహా నేడే రావాలి నా దీపావళి పండగా నేడే రావాలి నా దీపావళి పండగా
రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది నే నాటితో రోజా నేడే పూయునే
పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా
పగలే ఇక వెన్నెలా పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా రేయిలో హరివిల్లే వస్తే నేరమా
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్ బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం నూరు కలలను చూచినచో ఆరు కలలు ఫలియించు కలలే దరీచేరవా
పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా
నా పేరే పాటగా కోయిలే పాడనీ నే కోరినట్టుగా పరువం మారనీ
భరతం తం తం మదిలో తం తోం ధిం భరతం తం తం మదిలో తం తోం ధిం
చిరుగాలి కొంచం వచ్చి నా మోమంతా నిమరని రేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకూ బ్రతుకే బతికేందుకూ
పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా
అహా నేడే రావాలి నా దీపావళి పండగా నేడే రావాలి నా దీపావళి పండగా
రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది నే నాటితో రోజా నేడే పూయునే