2023

ఓరి వారి

ori vaari

🎬 Dasara
ఓరి వారి
Advertisement
ఓరి వారి నీది గాదురా పోరి ఇడిసెయ్ రా ఇంగ ఒడిసెను దారి ఓపారి అవ్వ ఒడిలో దూరి మరిసెయ్ రా సిన్న మొల్లిగా మారి
Advertisement

బాల్యమే గొప్పది బాధ మర్షిపోతది చందమామ రాదనే నిజము నమ్మనంటది చిన్న పల్లీపట్టీకె ఏడుపాపి చూస్తది కోడె ఈడు సెడ్డది నిజాన్ని కోడై కూస్తది
ఓరి వారి నీది గాదురా పోరి బజ్జోరా సంటి బిడ్డగా మారి
హో హో హో హో హో హోహో హో హో ఓహో హోహో హో హో హో హో హో హో హోహో హో హో ఓహో హోహో హో
ప్రేమ నాలో దాచిన చిన్న బొడ్డెమ్మగానే గావురంగా నిన్ను నేనే వద్దనీ గిరిగీసుకున్న గింత దెల్వకుంటా
రగిలి నా వేదనే దీపమోలే వెట్టినా పేర్చినా బతుకమ్మనే కన్నీళ్ళలో సాగదోలిన ఇడిచేసి వదిలేశిన
రెక్కలిరిగినట్టి ఈగ సుడిగాలిలో చిక్కినట్టు దిక్కు మొక్కు లేని కన్ను ఎక్కి ఎక్కి ఎడ్శినట్టు
నీకు దగ్గరవ్వలేక దూరమయ్యే దారిలేక చితికిపోయే నా బతుకిలా
గుండె పుండు మీద గొడ్డు కారమద్ది గుద్దుతుంటే గుక్కపెట్టి ఏడవలేని జన్మా
ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ హో హో హో హో హో హోహో హో హో ఓహో హోహో హో
Cast & Crew
✍️LyricsSri Mani
HeroNani
💫HeroineKeerthy Suresh
🎬DirectorSrikanth Odela