2023

నువ్వు నవ్వుకుంటూ

Nuvvu Navvukuntu

🎬 Mad
Advertisement
నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే నా గుండెనేమో గిల్లి పోమాకే
Advertisement

చిన్ని చిన్ని కళ్ళే అందం ముద్దు ముద్దు మాటలు అందం బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే
ముక్కు మీద కోపం అందం మూతి ముడుచుకుంటే అందం ఝంకాలలా ఊగుతు ఉంటే ఇంకా అందమే
నీ పిచ్చి పట్టిందిలే అది నీవైపే నెట్టిందిలే
ఏమైన బాగుందిలే నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంట జాతరలే
నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లి పోమాకే నువ్వు తప్పుకుంటు వెళ్ళిపోమాకే పిల్లా నిన్ను హత్తుకుంటు ఉండి పోతానే
ఈ తిరిగే తిరుగుడు గుడి చుట్టు తిరిగితే దిగి వచ్చి దేవతే వరమిస్తా నంటదే
నువ్వు కొంచెం కరిగితే ప్రపంచం మునగదే ఈ పంతం వదిలితే యుగాంతం రాదులే ఏ ఏ ఏ
నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లి పోమాకే నువ్వు తిప్పుకుంటు వెళ్ళిపోమాకే పిల్లా నేను తిట్టుకుంటు ఉండి పోలేనే
అవునంటే అవునను కాదంటే కాదను నడి మధ్య ఊగితే నేనెట్టా సావను
నీలాగే అందరు విసిగిస్తే అమ్మడు మగవాడెవ్వడు ప్రేమంటే నమ్మడూ ఊ ఊ ఊ
నువ్వు నవ్వుకుంటు వెళ్ళిపోమాకే అయ్ అయ్ అయ్ అయ్ నా గుండెనేమో గిల్లి పోమాకే చూసి చూడనట్టు వెళ్ళిపోమాకే పిల్లా కొంచం కసురుకుంటు ఉండి పోరాదే