2017

నువ్వేలే నువ్వేలే

Nuvvele Nuvvele

🎬 Jaya Janaki Nayaka
🎤 Swetha Mohan🎵 Devi Sri Prasad✍️ Chandrabose
Advertisement
నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్లకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే
Advertisement

నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే
నడవలేని చోటులోన పూల బాట నువ్వేలే నిదురలేని జీవితాన జోల పాట నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్లకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే
మేఘాలెన్నున్నా ఆకాశం నువ్వేలే రాగాలెన్నున్నా అనురాగం నువ్వేలే బంధాలెన్నున్నా ఆనందం నువ్వేలే కష్టాలెన్నున్నా అదృష్టం అంటే నువ్వేలే
అలసి ఉన్న గోంతులోన మనసు మాట నువ్వేలే అడవిలాంటి గుండెలోన తులసికోట నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్లకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే
ధైవలెన్నున్నా నా ధైర్యం నువ్వేలే స్వర్గాలెన్నున్నా నా సొంతం నువ్వేలే దీపాలెన్నున్నా నా కిరణం నువ్వేలే ఆభరణాలెన్నున్నా నా తిలకం మాత్రం నువ్వేలే
మధురమైన భాష లోన మొదటి ప్రేమ నువ్వేలే మరణమైన ఆశలోన మరొక జన్మ నువ్వేలే