2014

నిమిషం నిమిషం

nimisham nimisham

🎬 Drushyam
నిమిషం నిమిషం
Advertisement
నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం గడిచే సమయం నడిపింది వింత జాలం నీకైనా నాకైనా గత క్షణములోన జరిగింది కాస్త మార్చేయడం సులభమా మరు క్షణములోన జరిగేది ఏంటో ఊహించటం సాధ్యమా నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం నీకైనా నాకైనా మరు క్షణములోన జరిగేది ఏంటో ఊహించటం సాధ్యమా
Advertisement

గాయాలు చేసేది ఈ కాలమే గాయని మాన్పించేది ఈ కాలమే గాయని మాన్పించేది ఈ కాలమే కనుకే లేదు ప్రేమ జాలి కరుణ మనకే పోదు మనపై మమతా తపన కాల సంద్రానికె ఎదురీతే కాదా బ్రతుకంటే నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం గడిచే సమయం నడిపింది వింత జాలం
కథ మలుపు తిప్పించేది ఈ కాలమే కన్నీళ్లు తెప్పించేది ఈ కాలమే కన్నీళ్లు తెప్పించేది ఈ కాలమే థానే కరిగి మిన్నే కదిపి కుదిపి థానే తరిగి నిన్నే తరిమి తరిమి ఒక్క క్షణ కాలమే వెంటాడేనంట కల కాలం నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం గడిచే సమయం నడిపింది వింత జాలం నీకైనా నాకైనా గత క్షణములోన జరిగింది కాస్త మార్చేయడం సులభమా మరు క్షణములోన జరిగేది ఏంటో ఊహించటం సాధ్యమా నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం నీకైనా నాకైనా మరు క్షణములోన జరిగేది ఏంటో ఊహించటం సాధ్యమా
Cast & Crew
✍️LyricsChandrabose
🎵MusicSharreth
HeroVenkatesh
🎬DirectorSripriya