2011

నేను తానని

nenu thaanani oh my

🎬 Oh My Friend
నేను తానని
Advertisement
నేను తానని అనుకుంటారా నేనే తానని అనుకోరా ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా ఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారా స్నేహం మొహం రెండు వేరని తెలిసి తప్పుకుపోతారా హోం హోం
Advertisement

ఒక చోటే ఉంటూ ఒకటే కల కంటూ విడి విడిగా కలిసే వుండే కళ్ళది ఏ బంధం కలకాలం వెంటే నడవాలనుకుంటే కాళ్లకు ఓ ముడి ఉండాలని ఎందుకు ఈ పంతం
చుట్టరికముందా చెట్టుతో పిట్టకేదో ఏంలేకపోతే గూడు కడితే నేరమా ఏ చెలిమి లేదా గట్టుతో ఎటి కేదో వివరించమంటే సాధ్యమా
నేను తానని అనుకుంటారా నేనే తానని అనుకోరా ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా ఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారా స్నేహం మొహం రెండు వేరని తెలిసి తప్పుకుపోతారా
కనులకు కనిపించే రూపం లేకుంటే ప్రాణం తానున్నానన్నా నమ్మను అంటారా చెవులకు వినిపించే సవ్వడి చేయందే గుండెల్లో కదిలే నాదం లేదని అంటారా
మదిలోని భావం మాటలో చెప్పకుంటే అటువంటి మౌనం తాగనిదంటూ అర్థమా తీరాన్ని నిత్యం ఆలా అలా తాకుతుంటే నిలిపే నిషేధం న్యాయమా
నేను తానని అనుకుంటారా నేనే తానని అనుకోరా ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా ఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారా స్నేహం మొహం రెండు వేరని తెలిసి తప్పుకుపోతారా హోం హోం
Cast & Crew