2010

నీతో నీడల్లే

Neetho Neadalle

🎬 Bheemili Kabaddi Jattu
🎤 V V Prasanna🎵 V. Selvaganesh✍️ Vanamali
Advertisement
నీతో నీడల్లే రానా నాలో నేనంటూ లేనా నిలవదే నిమిషం అయినా తలపులై తరిమే తపనా నిలువెల్లా నీ అలోచనా నీతో నీడల్లే రానా
Advertisement

నిన్నటి తియ్యని కలయికనే వరమల్లే అనుకోనా గుండెల్లోన వెల్లువైన గురుతులనే నెమరేసె అలలైనా ప్రతి స్వప్నం నాలో నిజాలైనా నిలిపేనా నా కంటి ముందుగా నిన్నీ క్షణానా మది నీ కోసమే వేచెనా
నీతో నీడల్లే రానా
చేసిన బాసలు చెరగవులే ఎడబాటె ఎదురైనా నాకోసం నువ్వొస్తావని తెలిపెనులే ప్రతి ఆశ ఎదలోనా మరే నాడు నీతో ప్రయానమైనా ఇలా నీకై ఊపిరొక్కటే నిరీక్షించినా నను చేరాలి ఎవరాపినా
నీతో నీడల్లే రానా నాలో నేనంటూ లేనా