2013

మేఘాల్లో

meghallo seethamma vakitlo sirimalle

🎬 Seethamma Vakitlo Sirimalle Chettu
మేఘాల్లో
Advertisement
మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరికి శ్రీ హరికి కళ్యాణం కానుంది శ్రీరస్తు శుభమస్తు అన్నారండి అచ తెలుగింట్లో పెళ్ళికి అర్థం చెప్తారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండీ
Advertisement

అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురునీ వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవట ఓ రమని
ఇంతవరకెన్నో చూసాం అనుకుంటే సరిపోదుగా ఎంత బరువంటే మోసే దాక తెలియదుగా ఇంతమందున్నాం లే అనిపించే బింకం చాటుగ కాస్తైనా కంగారు ఉంటుందిగ నీకైతే సహజం తీయని బరువై సొగసించే బిడియం పనులెన్నో పెట్టి మా తలలె వంచిందే ఈ సమయం మగాళ్ళం ఐనా ఎం చేస్తాం సంతోషంగ మోస్తాం ఘన విజయం పొందాకే తీరిగ్గా గర్విస్తాం
అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురునీ వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవట ఓ రమని
రామ చిలకలతో చెప్పి రాయించమే పత్రిక రాజా హంసలతో పంపి ఆహ్వానించాం గ కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా ఏ మాత్రం ఏ చోట రాజి పడలేక చుట్టాలందరికి ఆనందంతో కళ్ళు చెమర్చేలా గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కనులను వీచేలా కలలోనైనా కన్నమ కథలైనా విన్నామా ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మ
అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురునీ వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవట ఓ రమని