Advertisement
తళుక్ తళుక్ మని తళుకుల తార
మినుక్ మినుక్ మని మిల మిల తార
చమక్ చమక్ మని చిలిపి సితార ఓహో
తళుక్ తళుక్ మని తళుకుల తార
మినుక్ మినుక్ మని మిల మిల తార
చమక్ చమక్ మని చిలిపి సితార ఓహో
Advertisement
మనసున్న కనులుంటే ప్రతి చోట మధుమాసం కనిపించదా
కనులున్న మనసుంటే బ్రతుకంతా మనకోసం అనిపించిందా
బంగారు భావాల ప్రియా గీతం
రంగేళి రాగాల జలపాతం
మనలోనే చూపించదా

అలలై ఎగసిన ఆశ నాట్యం చేసే వేళా
అలుపే ఎరుగని శ్వాస రాగం తీసే వేళా
దిశలన్నీ తల వొంచి తొలగే క్షణం
ఆకాశం పలికింది అభినందనం
అదిగదిగో మన కోసం తారాగణం
తళుకులతో అందించే నీరాజనం
మన దారికెదురున్నదా
మనసున్న కనులుంటే ప్రతి చోట మధుమాసం కనిపించదా
నవ్వే పెదవుల పైన ప్రతి మాట ఒక పాటే
ఆడే అడుగుల లోన ప్రతి చోట పూబాటే
గుండెల్లో ఆనందం కొలువున్నదా
ఎండైనా వెన్నెల్లా మురిపించదా
కాలాన్నే కవ్వించే కల ఉన్నదా
కష్టాలు కన్నీళ్లు మరిపించదా
జీవించడం నేర్పదా
మనసున్న కనులుంటే ప్రతి చోట మధుమాసం కనిపించదా
కనులున్న మనసుంటే బ్రతుకంతా మనకోసం అనిపించిందా
బంగారు భావాల ప్రియా గీతం
రంగేళి రాగాల జలపాతం
మనలోనే చూపించదా