Advertisement
బావయ్యో బావయ్యో బావయ్యో వస్తావా
బళ్లారి తోవల్లో బొమ్మనాడిస్తావా
సిట్టి నా గుండె మీద గుట్టుగా పాలపిట్టై
సిగ్గు సీమంతం జేస్తావా వా వా వా
Advertisement
లీలమ్మో లీలమ్మో లవ్లీగా చూత్తావా
చక్రాల కళ్ళతో దిల్లునే కోస్తావా
రంగులరాట్నంలాగ
నీ వొళ్ళో కూసోపెట్టి
సీమంతా తిప్పుకొస్తావా వా వా వా
లగో లగోరే లగ్గం పెట్టిస్తా
బాసింగాలు కట్టించాకా బంతులాడిస్తా
హే గజ్జల్ పట్టీల్తో హే గడప దాటేస్తా
మున్నెల్లకే మమ కచ్చా మ్యాంగో తినేస్తా
అమ్మి యమ ఉన్నావే కిరాక్కు
సోనామసూరి లాంటి నీ సోకు
రెడ్డి నీ మీసాలే కసక్కు
నేనిచ్చే చాన్సే హే ఇచ్చాయి పాసు
పొద్దు పొద్దున్నే ముద్దు ఫలహారం
మధ్యాహ్నంకే మడత నడుం నీకే గుడారం
ఏ సందే దూకిందా సైగా అలారం
కోక పుంజు కూసేదాక దుమ్ము ధుమారం
అమ్మీ నీ కులుకేమో గోకాకు
దొమ్మీ అయిపోద్దే నువ్ నవ్వాకు
రెడ్డి నువ్ సెయ్యస్తే పటాకు
హే వడ్డి ఇస్తా లెక్కే తెల్సాకు
లీలమ్మో లీలమ్మో లవ్లీగా చూస్తావా
చక్రాల కళ్ళతో దిల్లునే కోస్తావా
రంగులరాట్నంలాగ నీ వొళ్ళో
కూసోపెట్టి సీమంతా తిప్పుకొస్తావా వా వా వా