2012

లాయి లాయి

Laayi Laayi

🎬 Yeto Vellipoyindhi Manasu
🎤 Ilaiyaraaja , Bela Shende🎵 Ilaiyaraaja✍️ Anantha Sriram
Advertisement
లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా మాయలేని మోయలేని ప్రాయమమ్మా లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా గాలి రంగులోన ఉన్న గాయమమ్మా లేత లేత చేతిలో చేతులేసి చేరుకో ఊసులెన్నో పంచుకున్న వేళలో మనదే సరదా సరదా
Advertisement

లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా మాయలేని మోయలేని ప్రాయమమ్మా లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా గాలి రంగులోన ఉన్న హృదయమమ్మ
ఇంతలో ఇలా ఎదిగిన ఆ తలపులో ఎవరికై ఈ పిలుపులో వింత వింతగా తిరిగిన ఈ మలుపులో తన జతేను కలుపుకో ఇదేంట చెప్పలేని ఈ భావనే పేరునుందో తెలియదు దానికైనా ఈ వేళ జవాబు చెప్పలేని ఈ ప్రశ్నలింకేన్ని ఎన్నో అవన్నీ బయటపడవు ఇవ్వాళ లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి
స్పర్శలాగా పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా మాయలేని మోయలేని ప్రాయమమ్మా లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా గాలి రంగులోన ఉన్న గాయమమ్మా
మాటిమాటికీ మొదలయే అలికిడి మరుక్షణం ఓ అలజడి ఆకతాయిగా తడిమితే తడబడి తరగదే ఈ సందడి చలాకి కంటిపూల తావీదు తాకిందిలాగ గులాబీ లాంటి గుండె మోసేనా ఇలాంటి గారడీల జోరింక చాలించదేల హో ఎలాగా ఏమనాలి ఈ లీల లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి స్పర్శలాగా పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా మాయలేని మోయలేని ప్రాయమమ్మా లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా గాలి రంగులోన ఉన్న గాయమమ్మా లేత లేత చేతిలో చేతులేసి చేరుకో ఊసులెన్నో పంచుకున్న వేళలో మనదే సరదా సరదా లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా మాయలేని మోయలేని ప్రాయమమ్మా లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా గాలి రంగులోన ఉన్న హృదయమమ్మ