1999

కుంకుమ పూల

Kunkuma Poola

🎬 Devi
Advertisement
కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారీ మేలిమి బంగారు చీరలో మెరిసే ఓ వయ్యారీ
Advertisement

నా మనసులోని మరాళీ మల్లెల చిరుగాలీ నా ప్రేమ నీకు నివ్వాలీ నువ్వే నువ్వే కావాలీ
శంఖములూదిన ప్రేమకే చేశా మది నివ్వాలీ అంకెలకందని ఆశలే దాచా రా విహారీ
నా వలపు నీకు సుమాలీ యవ్వన వనమాలీ ఈ చంద్రకాంత చకోరీ గుండెల్లోకి చేరాలీ
కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారీ శంఖములూదిన ప్రేమకే చేశా మది నివ్వాలీ
మంచు కొండా అంచు మీద నుంచి వచ్చు మబ్బుల సందేశం ఈ తామర మొగ్గకి తప్పదు అన్నది కాముని సాహవాసం హంస రెక్క పక్క ఆది తాళమేసి పలికెను ఆహ్వానం ఈ అచ్చట ముచ్చట ఇచ్చట తీరగా హెచ్చెను హేమంతం
ప్రియమగు ప్రియురాలా చంపకు విరహాలా విరిసిన పరువాల పిలిచెను మధుబాల
ఊగీ ఊగీ రేగే అందాలే విరిసే పూ బంధాలే మధురం మధురం సాగే సరాగం మనసా వాచా
కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారీ శంఖములూదిన ప్రేమకే చేశా మది నివ్వాలీ
అక్షరాలా నీకు ఇచ్చి పుచ్చుకున్న వెచ్చని తాంబూలం అది ముద్దుగా మారీ బుగ్గన చేరిన పుష్యమి నక్షత్రం ఎక్కు పెట్టి ఉన్న పంచదార విల్లు చేసింది ఈ గాయం అది గుచ్చాక పొతే వచ్చిన వయసుకు తీరదు మోమాటం
నిలిచా నిను కోరీ రసమయ రహదారీ శుభమే సుకుమారీ సొగసుకి ప్రతి సారీ
మదిలో ఎదలో ఒడిలో నువ్వేలే పొంగే ఆనందాలే నింగీ నెలా ఏలే రాగాలే నీవూ నేనై
శంఖములూదిన ప్రేమకే చేశా మది నివ్వాలీ కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారీ
నా వలపు నీకు సుమాలీ యవ్వన వనమాలీ నా ప్రేమ నీకు నివ్వాలీ నువ్వే నువ్వే కావాలీ