2022

కొత్త కొత్తగా

kottha kottha gaa aa ammayi gurinchi meeku

🎬 Aa Ammayi Gurinchi Meeku Cheppali
కొత్త కొత్తగా
Advertisement
హా అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో హా రవ్వంత గారంగా నాలో నీ నన్ను మాటాడిస్తుంటే ఏం చెప్పాలో
Advertisement

ఆ అనగనగా మనవి విను ముసిముసి ముక్తసరి నవ్వుతో నిలకడగా అవును అను తెరలు విడే పలుకు సిరితో
కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే ఆ కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే
హా అల్లంత దూరంగ నువ్వు నీ కన్ను నన్నే చూస్తుంటే ఏం చెయ్యాలో హా రవ్వంత గారంగా నాలో నీ నన్ను మాటాడిస్తుంటే ఏం చెప్పాలో
హో ఆ తలపు దాకా వచ్చాలే తగని సిగ్గు చాల్లే తగిన ఖాళీ పూరిస్తాలే
హా చనువు కొంచం పెంచాలే మొదటికన్నా మేలే కుదిరినంతా కులాసాలే
హా నిను కననీ నిను కననీ కదలికకు తెలవారదే హో నిదురవనీ ప్రతి కలలో నీ ఊసే తారాడుతోందే
కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే ఆ కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే
సమయమెల్లా సాగిందో గమనమైనా లేదే తమరి మాయేగా ఇదంతా ఓ ఓ పయనమెల్లా పండిందో మరపురానే రాదే మధురమాయే సంగతంతా
ఆ ఆ ఎద గదిలో ఓ ఓ ఎద గదిలో కిరణమయే తరుణం ఇదే ఇరువురిలో చలనమిలా ప్రేమన్న పేరందుకున్నదే
హా కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బావుందే ఆ ఆ పోను పోను ఇంకొంచెం బావుండేలా ఉందే హో చెలిమి కల చెరిసగమే చిటికెన వేలి చివరంచులో సఖిలదళ విడివడని ముడిపడవే ప్రియతమ ముడితో