2022

కానున్న కళ్యాణం

Kanunna kalyanam

🎬 Sita Ramam
🎤 Anurag Kulkarni , Sindhuri Vishal🎵 Vishal Chandrasekhar✍️ Sirivennela Seetharama Sastry
Advertisement
కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం
Advertisement

విడువని ముడి ఇది కదా ముగింపులేని గాథగా
తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా
కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా
చుట్టు ఎవరూ ఉండరుగా గిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా
గట్టి మేళమంటూ ఉండదా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే
కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా
తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటటా తమరి చొరవట
బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలువు పోల్చుకో సరే మరి
కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళముందు పారాడగా