2021

కన్నే అదిరింది

kanne adhirindhi

🎬 Roberrt
కన్నే అదిరింది
Advertisement
కన్నే అదిరింది పైటే చెదిరింది కాలే నిలవదు పిలగా నిన్నటికెళ్ళి గమ్మతుగుంది గమ్మతుగుంది గుండెల లొల్లి సమ్మగ ఉంది మీట కిల్లేలా నిన్నే కొరకాలా నోరే ఎర్రగ పండా నిన్నటికెళ్ళి గమ్మతుగుంది గమ్మతుగుంది గుండెల లొల్లి సమ్మగ ఉంది పాణం ఎళ్ళిపోయే నువ్వే గురుతొస్తే నీ నవ్వే యాదొస్తే నూరు మందిని కంట ఫిఫ్టీ నీకంటా ఓ ఫిఫ్టీ నాకంటా జరా అర్జెంటుగ నువు డేటు జూస్తే జంపేనంట నిన్నటికెళ్ళి గమ్మతుగుంది గుండెల లొల్లి సమ్మగ ఉంది
Advertisement

సురసురమన్నదిరా సన్న పిడికెడు నడుమేరా నువ్వే చూస్తే సెగపుట్టెను రణధీరా సరసర సరదాగా చిరు చెక్కెర దాచారా చోరీ చేసెయ్ నువ్వు ముద్దుగ సుకుమార కదలివస్తా చలిగాలి నేనై కౌగిలిస్తా మండేటి ఎండై ఇక నా ఇంట్లో ఎవరో చూస్తారంటూ ఆగను లేరా నిన్నటికెళ్ళి గమ్మతుగుంది గుండెల లొల్లి సమ్మగ ఉంది
సమ్మతి అక్కర్లే సరిహద్దుకు టక్కర్లే తెచ్చా సరుకే వాటంగా తడమాల మెలికల ఒళ్ళంతా చలో కమ్మని ముద్దాట నేనే బంతి పట్టెయ్ రా నలిపేలా గడ్డిపరకా ననుమీటి మసలే నా వేడికి పదునుంది అసలే జల్దీ తాళికి ముడులే మల్లెల గదులే సూడర ఎల్లీ
నిన్నటికెళ్ళి గమ్మతుగుంది గుండెల లొల్లి సమ్మగ ఉంది నిన్నటికెళ్ళి గమ్మతుగుంది హ గుండెల లొల్లి సమ్మగ ఉంది
Cast & Crew
🎤SingersMangli
✍️LyricsShyam Kasarla
HeroDarshan
💫HeroineAsha Bhat
🎬DirectorTharun Sudhir