2019

కళ్లలో కలవరమై

Kallallo Kala Varamai

🎬 Dorasaani
Advertisement
కళ్లలో కలవరమై కలవరమై గుండెలో పరవశమో వరమై కళ్లలో కలవరమై కలవరమో వరమే అవగా గుండెలో పరవశమో వరమై కళ్లలో కలవరమై కలవరమై కలిగే కోరిక
Advertisement

ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా ఊహాలే ఎన్నో కొంటె కథలే చెప్పగా ఆరాటాల వడిలో ఆడుతూ ప్రాణమే ఆనందాల నిధికై చూడగా ఊరించే ఊసులు ఎన్నో ఉడికిస్తూ చంపుతుంటే ఆ తపనలోన తనువు తుళ్ళి పడుతుంటే
పాల బుగ్గలోని తళుకులే వెన్నుపూస లోన వణుకులై కంటిపాప లోన కవితలా మారే చిన్ని మనసులోని కోవెల పసిడి వన్నెలోని నవ్వులా లేత పెదవిపైన ముత్యమై మెరిసే
ఏమో ఏమో ఏమో అసలే మెల్లగా ఎదపై తీపి మధువే చెల్లగా ఏదో ఏదో ఏదో మైకమే ముద్దుగా మైమరపించు మాయే చెయ్యగా అణువణువు అలజడి రేగి తమకంలో తేల్చుతుంటే ఆ ఆదమరపులోన ఈడు సతమతమై
పాల బుగ్గలోని తళుకులే వెన్నుపూస లోన వణుకులై కంటిపాప లోన కవితలా మారే చిన్ని మనసులోని కోవెల పసిడి వన్నెలోని నవ్వులా లేత పెదవిపైన ముత్యమై మెరిసే
Cast & Crew
🎤SingersChinmayi Sripada
✍️LyricsShreshta
🎬DirectorKVR Mahendra