2018

కాదని నువ్వంటున్నదీ

kaadhani nuvvantunnadhi happy

🎬 Happy Wedding
కాదని నువ్వంటున్నదీ
Advertisement
కాదని నువ్వంటున్నదీ అవునని వినిపిస్తున్నది నిజమేనా
Advertisement

ఓ కాదని నువ్వంటున్నదీ అవునని వినిపిస్తున్నది నిజమేనా
ఏమో ఏమన్నానో ఏమో ఎం విన్నావో
ఎం కావాలంటున్నదీ అటు ఇటు ఊగే నీ మది తెలిసేనా ఎం కావాలంటున్నదీ అటు ఇటు ఊగే నీ మది తెలిసేనా
ఏమో ఎం కావాలో తనకీ తెలుసో లేదో ఏమో ఎం కావాలో తనకీ తెలుసో లేదో
కోరే వరమేదో మునుముందే నిలుచుందే ఇంకా కలలేనా కనుపాపా
చేరే దరియెదో రమ్మంటూ ఎదురైతే చూస్తూ నిలుచోదే తెరచాపా
పారాడే పసిపాపవా ప్రాయం రాలేదా అడుగేస్తే పడిపోతావా పడవే ముందడుగా
ముందు వెనక చూడకా పడిపోమంటావా నువ్వు చూపిందే తోవంటూ తరిమే దుందుడుకా
ఏమో ఎం కావాలో తనకీ తెలుసో లేదో ఏమో ఎం కావాలో తనకీ తెలుసో లేదో
నీలో నీతోనే దోబూచి దొంగాట నీకే నువ్వు దొరికేదేపుడంటా
ఆటో వేటో తేలనీ మన ఈ చెలగాట ఆలోచిద్దాం అందాక తప్పేం లేదంటా
కవ్వించే కయ్యాలతో నెగ్గదు చెలిమాటా ఓటమినే గెలుపంటుంది మనసుల ముద్దాటా
అవునా అంతేనేమో అయినా ఇంతేనేమో అవునా అంతేనేమో అయినా ఇంతేనేమో
ఓ కాదని నువ్వంటున్నదీ అవునని వినిపిస్తున్నది నిజమేనా ఓ ఎం కావాలంటున్నదీ అటు ఇటు ఊగే నీ మది తెలిసేనా
ఏమో ఏమో ఏమన్నానో ఏమన్నావో ఏమో ఏమో ఎం విన్నావో ఎం విన్నానో ఏమో ఏమన్నానో ఏమో ఎం విన్నావో ఏమో