2015

జత కలిసే

jatha kalise

🎬 Srimanthudu
జత కలిసే
Advertisement
జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదోక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చు గుద్దినట్టు ఒక కలగంటు ఉన్నారిద్దరు ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నా రానందంగా ఒకరిని ఇంకొకరు
Advertisement

నలుపు జాడ నళుసైనా అంటుకొని హృదయాలు తలపులోతునా ఆడమగలని గుర్తులేని పసివాళ్లు మాట్లాడుకోకున్నా మది తెలుపుకున్నా భావాలూ ఒకరికొకరు ఎదురు ఉంటె చాలులే నాట్యమాడు ప్రాయాలు
పేరుకేమో వేరు వేరు బొమ్మలేమరి ఇరువురికి గుండెలోని ప్రాణమొకటే కదా బహుశా బ్రహ్మ పొరపాటులోన ఒక్కరే ఇద్దరు అయ్యారు ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీళ్లు చదివేస్తున్నా రానందంగా ఒకరిని ఇంకొకరు
ఉన్నచోటు వదిలేసి ఎగిరిపోయెను ఈ లోకం ఏకమైనా ఈ జంట కొరకు ఏకాంతమివ్వటం కోసం నీలి రంగు తెర తీసి తొంగి చూసే ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలు ఉండలేదు ఒక నిమిషం
నిన్నదాకా ఇందుకేమో వేచి ఉన్నది ఏడ తెగని సంబరంగా తేలినాను నేను ఇలా ఇప్పుడే కలిసి అప్పుడే వీరు ఎప్పుడో కలిసిన వారైయ్యారు ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నా రానందంగా ఒకరిని ఇంకొకరిని
Cast & Crew
🎤SingersSuchith SuresanSagar
✍️LyricsRamajogayya Sastry
💫HeroineShruti Haasan
🎬DirectorKoratala Siva