2005

జగమంతా కుటుంబం

Jagamantha Kutumbham

🎬 Chakram
Advertisement
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం సూన్యం నావే
Advertisement

జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
కవినై కవితానై భార్యనై భర్తనై కవినై కవితానై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాలా కన్నీటి జలపాతాల
నాతొ నేను అనుగమిస్తూ నాతొ నేనే రమిస్తూ వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని రంగుల్నీ రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల కూతలా మంటను నేనై రవినై ససినై దివమై నిషినై నాతొ నేను సహగమిస్తూ నాతొ నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరినాల్ని హరినాల చరణాల్ని చరణాల చలనాన కానరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
గాలి పల్లకీలోన తరలి నా పాటా పాప ఊరేగి వెడలె గొంతు వాకిలిని మూసి మరలి తాను మూగబోయి నా గుండె మిగిలే
నా హృదయమే నా లోగిలి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు ఆలీ నా హృదయములో ఇది సినివాళి
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది