1985

జాబిల్లి కోసం

jabilli kosam manchi

🎬 Manchi Manasulu
🎤 S.P. Balu🎵 Ilayaraja✍️ veturi
జాబిల్లి కోసం
Advertisement
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
Advertisement

జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై నిను కాన లేకా.. మనసూరుకోకా.. పాడాను నేనూ పాటనై జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
నువ్వక్కడ.. నేనిక్కడ పాటిక్కడ.. పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఎనాడైనా నువ్వక్కడ.. నేనిక్కడ పాటిక్కడ.. పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఎనాడైనా ఈ పువ్వులనే నీ నవ్వులుగా.. ఈ చుక్కలనే నీ కన్నులుగా నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లొ తేలీ వుర్రూతలూగీ.. మేఘాలతోటీ రాగాల లేఖా నీకంపినానూ.. రావా దేవీ
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై నిను కాన లేకా.. మనసూరుకోకా.. పాడాను నేనూ పాటనై జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది యెన్నళ్ళైనా నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది యెన్నళ్ళైనా వుండీ లేకా వున్నది నీవే వున్నా కూడా లేనిది నేనే నా రేపటి అడియాసల రూపం నీవే దూరాన వున్నా నా తోడు నీవే నీ దెగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై నిను కాన లేకా.. మనసూరుకోకా.. పాడాను నేనూ పాటనై జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై.. వేచాను నీ రాకకై
Cast & Crew
🎤SingersS.P. Balu
✍️Lyricsveturi
🎵MusicIlayaraja
💫HeroineBhanupriya
🎬DirectorMohan Gandhi