Advertisement
ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే
కన్ను ఇంతే కనుపాప ఇంతే లోకం లోతు చూడాలంతే
ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే
కన్ను ఇంతే కనుపాప ఇంతే లోకం లోతు చూడాలంతే
Advertisement
మొగ్గల్లోన దాగుంది కాయొపండో కనిపెట్టాలి ముందే
మబ్బులోన దాగుంది చినుకు తూఫానో పసిగట్టాలి ముందే
మనుషుల్లో మంచోడేవారో ముంచేదెవరో మనసెట్టి చూడాలంతే
ఈ మట్టిలోని వజ్రం చూడు బొగ్గులోని అగ్గిని చూడు
అన్నిటికన్నా నీలోని నిన్నే చూడు
అలా చూస్తే ఎదురే లేదంతే
ఇలా చేస్తే తిరుగే లేదంతే
రాసి ఫలాలన్నీ వచ్చుఁను నీ వెంటే
తొమ్మిది గ్రహాలన్నీ పనులే మాని తిరుగును నీ చుట్టే
ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే
గుడిసెల్లోని పెదలికి స్నేహితుడయ్యె గుణముండాలి నీలో
మెడలోని అమ్మడికి ప్రేమికుడయ్యే పొగరుండాలి నీలో
దేశాన్నే శోకం నుంచి చీకటి నుంచి రక్షించే సైనికుడవ్వాలి
నీ పనుల్లోనూ శ్రామికుడల్లే పగలు రేయి కార్మికుడల్లే
సముద్రంలో నావికుడాల్లే ముందుకు పోతుంటే
జనం మెచ్చ్చే నాయకుడవుతావు
జగం మెచ్చ్చే ఉత్తముడవుతావు
ప్రపంచంలో దేవుడివవుతావు
ఈ భూమి మీద అస్సలు సీసాలు మానవుడవుతావు
ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే
కన్ను ఇంతే కనుపాప ఇంతే లోకం లోతు చూడాలంతే