Advertisement
ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా
నీ నీడై నిలిచి వున్నానని
ఇన్నాళ్లు చెంతనున్న ఈనాడే చెప్పుకున్న
నీ కోసం బతికి వున్నానని
కొలువుండిపో ప్రాణమై ఇలా
ఎదనిండిపో అనురాగమా
ఇన్నాళ్లు చెంతనున్న ఈనాడే చెప్పుకున్నా
నీ కోసం బతికి వున్నానని
Advertisement
స్వప్నమో సత్యమో తెలుసుకోవద్దని
చూపుతో చెప్పని రెప్ప వెయ్యొద్దని
ఎప్పుడూ నిన్నిలా చూస్తుంటే చాల్లే అన్ని
మబ్బుల్లో జాబిల్లిని గుప్పిట్లో పొందాలని
నమ్మాలి అనిపించని ఊహల్లో నన్నుండని
ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా
నీ నీడై నిలిచి వున్నానని
నేననే మాటనే మరచిపోయానని
నిన్నిలా అల్లుటూ కొత్తగా పుట్టని
ఇప్పుడీ జన్మకి నీ పేరునే పెట్టని
నిట్టురుపులన్నింటిని నిన్నల్లో వదిలెయ్యని
రానున్న వెయ్యేళ్ళని ఈ పూట ఉదయించని
ఇన్నాళ్లు చెంతనున్న ఈనాడే చెప్పుకున్నా
నీ కోసం బతికి వున్నానని
ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా
నీ నీడై నిలిచి వున్నానని
కొలువుండిపో ప్రాణమై ఇలా
యదానిండిపో అనురాగమా
ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా
నీ నీడై నిలిచి వున్నానని