1997

ఇదే మంచి

Ide manchi

🎬 Pelli Pandiri
Advertisement
ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచభూతాలు సాక్షులుగా ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచభూతాలు సాక్షులుగా చినుకులనే అక్షింతలుగా మెరుపులతో దీవించెనుగా మేఘాల పెళ్లి పందిరి
Advertisement

ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచభూతాలు సాక్షులుగా ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచభూతాలు సాక్షులుగా చినుకులనే అక్షింతలుగా మెరుపులతో దీవించెనుగా మేఘాల పెళ్లి పందిరి
కళలు రాని కనులలోన కటిక చీకటి చెలిమి వీడి చలువలోన కరుగుతున్నది నిద్దరలోనే నిలచిపోదు కాలమన్నది వెలుగు వేలు రేయి చెలిమి అందుకున్నది
వరాల పెన్నిధి వారించుతున్నది తరంగమై మాది తధాస్తు అన్నది గెండెల్లో ఏనాడూ గంగాళ్లే పొంగింది రంగేళి దీపావళి ముంగిల్లో ఈ నాడు సంక్రాంతి ముగ్గల్లే చేరింది నా నిచ్చెలి
ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచభూతాలు సాక్షులుగా
మావి మనునల్లుకున్న మాధవి లతా జీవితాన్ని పంచుతున్న ప్రేమ దేవత గుడికి చేరే గరిక పూవు లాంటి నా కథ బ్రతుకు తీపి తెలుసుకుంది నేడు నా ఎద
కల్యాణ మంత్రమై దీవించే ఈ క్షణం వెయ్యేళ్ళ బంధమై రమ్మంది కాపురం పారాణి పాదల తారాడు నాదల కాహ్వానమందించన నాలోని ప్రాణాలు పూమాలగా చేసి నీ పూజాకందించాన
ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచభూతాలు సాక్షులుగా ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచభూతాలు సాక్షులుగా చిరు నవ్వులనే అక్షింతలుగా సొగసులతో దీవించెనుగా అందాల పెళ్లి పందిరి
ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచభూతాలు సాక్షులుగా ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచభూతాలు సాక్షులుగా