2011

గెలుపు తలుపులే

gelupu thalupulee teen

🎬 Teen Maar
గెలుపు తలుపులే
Advertisement
గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే అడుగు మెరుపులా మారే ఆనందమే వీడదీ బంధమే
Advertisement

ఎటువైపూ వెలుతున్నా వెలుగుల్నే చూస్తున్నా మెరిసావే రంగుల్లోనా కల తీరే సమయానా అల నేనై లేస్తున్నా అనుకుందే చేసేస్తున్నా
దారులన్ని నాతో పాటుగా ఊయలూగి పాటే పాడగా నను వీడి కదలదు కాలమొక క్షణమైనా
గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే
ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరెలే సందేహమేది లేదుగా సంతోషమంత నాదిగా చుక్కల్లో చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా దిక్కుల్ని మీటి వీణగా చెలరేగి కదిలెను గాలి తరగలే పైనా
గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే
అలుపే రాదు అంటూ కొలిచా నింగి అంచులనే జగమే ఏలుకుంటూ పరిచా కోటి కాంతులే ఇవ్వాల గుండెలో ఇలా చల్లారిపోని శ్వాసలా కమ్మేసుకుందే నీ కలా ఇన్నాళ్ళు లేని లోటులా తెల్లారిపోని రేయిలా నన్నల్లుకుంటె నువ్విలా నను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే
గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే
Cast & Crew
🎤SingersSreerama Chandra
✍️LyricsRehman
🎵MusicMani Sharma